కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలకు పెద్ద పీట : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ
దిశ, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల&కళాశాల, మైనారిటీ సంక్షేమ వసతి గృహాన్ని శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.అదేవిధంగా హాస్టల్లోని తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని,విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులను మందలించారు. సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, బిజ్జల అనిల్, ముఖ్య నాయకులు, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.