కాంగ్రెస్ నాయకులు బిల్లులు తీసుకొస్తే, కాంట్రాక్టర్‌లతో పని చేయించే బాధ్యత నాది : పల్లా రాజేశ్వర్ రెడ్డి
మండల కేంద్రంలోని బొమ్మ కూరు గ్రామంలో (ఐకేపీ) జై సంతోషిమాత
దిశ, నర్మెట్ట : మండల కేంద్రంలోని బొమ్మ కూరు గ్రామంలో (ఐకేపీ) జై సంతోషిమాత గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. డీపీయం వినీత మాట్లాడుతూ మహిళా సంఘాల నేతృత్వంలో కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించడం రైతులకు ఎంతో మేలు, ఈ సారి సన్న వడ్లకు రూ. 500 రూపాయలు బోనస్ వస్తుందని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా పీఏసీఎస్ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకుడు అంజయ్య గత ప్రభుత్వంలో జనగామ నర్మెట ప్రధాన రహదారి గానుగుపహాడ్ బ్రిడ్జి మరీ అధ్వానంగా మారిందని, రాకపోకలు నిలిచాయని వాగ్వదం చేశారు. వెంటనే పల్లా స్పందించి గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగింది నిజమే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బిల్లులు తీసుకొస్తే కాంట్రాక్టర్ లతో పని చేయించే బాధ్యత నాది అని అన్నారు. ఈ వాగ్వాదాన్ని సీఐ అబ్బయ్య, ఎస్సై నాగేష్ పోలీస్ సిబ్బంది ఇరువర్గాలకు సర్ది చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం లో కొనసాగించడం సంతోషంగా ఉందని,దేశంలో వరి పండించడంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నందుకు రైతులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత - వెంకటేష్, ఎమ్మార్వో రామానుజాచారి, ఏపీఎం మాదారపు రవి, ఎంపీడీఓ అరవింద్,ఆర్ ఐ సాయిబాబా, ఎఈఓ జగదీశ్,సీసీ లు యాదగిరి, కనకరాజు, కుమార్ వివో అధ్యక్షురాలు రేణుక, వివో ఏ రోజా, మహిళా సంఘ సభ్యులు,రైతులు, కాంగ్రెస్ బీ ఆర్ ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.