మంత్రులను కలిసిన ఎమ్మెల్యే..

హైదరాబాదులోని పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కలిశారు.

Update: 2024-10-20 03:25 GMT

దిశ‌, బయ్యారం : హైదరాబాదులోని పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కలిశారు. ఆయన ఆధ్వర్యంలో సోసైటి అధ్యక్షుడు మూల మధూకర్ రెడ్డి శుక్ర, శనివారం రోజుల్లో మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రులకు వినతులు అందచేసినట్లు సొసైటీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిశామని తెలిపారు. ఇల్లందు నియోజక వర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణానికి 30 కోట్ల నిధులకు ప్రపోజల్ ఇవ్వగా 15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. దీంతో ఎమ్మెల్యే, నాయకులు కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. మరికొన్ని నిధులు కావాలని కోరగా స్పందించిన మంత్రులు ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపడంతో ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ ఈఎన్సీ కనక రత్నం, ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శంకర్ ని, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డిని కలిసి ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేట్స్ ఇచ్చారని తెలిపారు.

మండలంలోని కోయగూడెం నుండి కాచినపల్లి వెళ్లే రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం 2, సుదరేవు నుండి మామిడిగూడెం వెళ్ళు బీటి రహదారి, హైలెవెల్ బ్రిడ్జిలు 3 అల్లిగూడెం నుండి బోటి తండా రోడ్డు పైన మూడు హై లెవెల్ బ్రిడ్జిలు గౌరారం నుండి ముత్యాలమ్మ గూడెం ఆర్ అండ్ బీ రోడ్డు వరకు డబుల్ రోడ్డు, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణమునకు నిధులు మంజూరు చేయవలసినదిగా ఎస్టిమేట్స్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్లు, బయ్యారం, గార్ల, మూల మధుకర్, రెడ్డి వడ్లమూడి దుర్గాప్రసాద్, సొసైటీ డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News