మినీ మేడారం జాతర తేదీలు ఖరారు..

ఫిబ్రవరి 2025 లో జరగబోయే మేడారం సమ్మక్క - సారలమ్మ మినీ జాతరకు సంబంధించిన తేదీలను సమ్మక్క - సారలమ్మల పూజారుల సంఘం శనివారం ఖరారు చేశారు.

Update: 2024-10-26 13:05 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ఫిబ్రవరి 2025 లో జరగబోయే మేడారం సమ్మక్క - సారలమ్మ మినీ జాతరకు సంబంధించిన తేదీలను సమ్మక్క - సారలమ్మల పూజారుల సంఘం శనివారం ఖరారు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర ముగిసిన తర్వాత సంవత్సరంలో వచ్చే మినీ జాతరకు సంబంధించిన తేదీలను ప్రకటించేందుకు మేడారంలోని సమ్మక్క - సారలమ్మల దేవాలయం ప్రాంగణంలో శనివారం సమ్మక్క - సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అధ్యక్షతన పూజారులు సమావేశమయ్యారు. మినీ జాతర 2025 సంబంధించిన తేదీలను ఫిబ్రవరి 12 బుధవారం నుంచి 15 శుక్రవారం వరకు జాతర జరగనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.


Similar News