మీ దీవెన నాకుండాలి.. కేసీఆర్‌ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి ప్రజల దీవెన నాకుండాలే... మీరుణం తీర్చుకునేందుకే మరోసారి ఎన్నికల్లో
దిశ,వరంగల్ బ్యూరో/ తొర్రూరు : పాలకుర్తి ప్రజల దీవెన నాకుండాలే... మీరుణం తీర్చుకునేందుకే మరోసారి ఎన్నికల్లో నిలబడ్డానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజా ఆశీర్వాదాన్ని కోరారు. మంగళవారం తొర్రూరులో జరిగిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవగా ఈసందర్భంగా దయాకర్‌రావు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తన శక్తివంచన లేకుండా కృషి చేశానని అన్నారు. పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకునేందుకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని, పాలకుర్తిని ఆర్డీవో డివిజన్‌గా చేయాలని, నూతనంగా రెండు మండలాల ఏర్పాటును సీఎంను సభాముఖంగా కోరారు. అలాగే చిందు, యక్ష గాన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.
సన్నూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ను ఎండోమెంట్ కింద డిక్లేర్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎండోమెంట్ పట్టాలు వారికి ఇవ్వాలి. రైతు బంధు కూడా ఇవ్వాలని కోరారు. టెక్స్టైల్ పార్క్ లో మన అక్క చెల్లెమ్మ ల ఉద్యోగాల కోసం కొన్ని కోట్లు పెట్టి కుట్టు మిషన్ లో శిక్షణ ఇప్పించాను, యువకులకు 23 వేల డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించాను, కరోనా సమయంలో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి కరోనా సోకిన వారందరికీ ట్రీట్మెట్ ఇప్పించానంటూ తెలిపారు. నిత్యం ప్రజా సేవలో అంకితమయ్యే తనను ప్రజలు 6సార్లు ఎమ్మెల్యే, 1సారి ఎంపీగా గెలిపించారని అన్నారు. 8వ సారి పాలకుర్తి ప్రజల ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.
Read More..
కేసీఆర్ ను వేటాడడానికి కామారెడ్డి నుంచి పోటీ : రేవంత్‌రెడ్డి