సీఎం కేసీఆర్ కు.. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లేఖ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు లేఖ రాశారు.
దిశ, కాటారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ కు మెయిల్ ద్వారా లేఖ వ్రాసినట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా నూతన పీఆర్సీ కమిటీ నియమించి, జూలై నుండి 30 శాతం ఐఆర్, 4 డీఏలు (జూలై కలిపి) ప్రకటించాలన్నారు. 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్న ఉద్యోగపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని ఆలోచించి సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు.
చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులకు బధిలీలు, పదోన్నతులు వెంటనే కల్పించాలని కోరారు. ఉద్యోగులందరికి, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ విధానం ద్వారా అన్ని ప్రయివేట్, ప్రభుత్వ ఆస్పత్రిలో నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్సీ 2020 కమిటీ సిఫారసుల ప్రకారం జారీ కానీ ఉత్తర్వులను వెంటనే విడుదల చేసి పెండింగ్ లో ఉన్న వివిధ రకాల ఆర్థిక బిల్లులను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరిని ముఖ్యమంత్రి గుర్తించి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని శ్రీధర్ బాబు లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలకపాత్ర..
రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడి, సకల జనుల సమ్మెను సైతం 42 రోజుల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యోగానికి సైతం వెళ్ళకుండా రోడ్ల పై సమ్మె చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళిన ఉద్యోగులు ఈ రోజు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ముఖ్యమంత్రి కి గుర్తు చేశారు. మొన్న 317 జీఓతో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా నష్టం జరిగింది. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు హై కోర్టును ఆశ్రయించారని దీని పై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. 317 జీవో ఇబ్బంది పడుతున్న తమ జిల్లా కాదని ఇతర జిల్లాలకు వెళ్లి పైన వెళ్ళిన ఉద్యోగపాధ్యాయులకు నాయం చేయగలరని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలు కూడా 2 సంవత్సరాల కాలం పూర్తి అయ్యిందన్నారు.
జనవరి 2022, జూలై 2022, జనవరి 2023తో కలుపుకొని 3 డీఏ దాదాపుగా (10.01%) లు తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగులకు ఇచ్చేది ఉందన్నారు. రాబోయే జులై 2023 డీఏ కూడా కలుపుకొని నాలుగు డీఏ లను ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఇచ్చే పీఆర్సీ కాలం పూర్తి అయినందున రాబోయే జులై 2023 నుండి కొత్త పీఆర్సీ ఇవ్వాలిసి ఉండగా ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ నియమించలేదు అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు కొరుతున్నట్లుగా నూతన పీఆర్సీ కమిటీని నియమించి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా జులై నుండి 30 % ఐఆర్, 4 డీఏలు ప్రకటించాలని శ్రీధర్ బాబు ఆలేఖలో పేర్కొన్నారు.