తాళం వేసి ఉన్న ఇండ్లే తండ్రీకొడుకుల టార్గెట్.. చివరికి కటకటాల పాలు..

తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడిన తండ్రీకొడుకులను జనగామ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2023-04-04 16:56 GMT

దిశ, జనగామ: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడిన తండ్రీకొడుకులను జనగామ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మంగళవారం రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా యశ్వంతపూర్ వద్ద వీరిని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో దాసరి నర్సయ్య (55), అతని కుమారుడు దాసరి మురళి (26) ఉన్నారు.

వీరు మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందినవారుగా డీసీపీ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 18 లక్షల 70 వేల విలువైన ఆభరణాలు, రూ.50 వేల నగదు, వెండితో కలుపుకుని మొత్తం రూ. 23 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనగామ ఏసీపీ దేవేందర్ రెడ్డి, సీఐ ఎలబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎస్ఐలు సీహెచ్. రఘుపతి, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News