లయన్ క్వెస్ట్ శిక్షణతో వ్యక్తిత్వ నిర్మాణాన్ని పెంచుకోవాలి

Update: 2024-08-09 05:33 GMT

దిశ, వరంగల్ : విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి లయన్ క్వెస్ట్ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందని 320ఎఫ్ డిస్ట్రిక్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాండ్ల రాజిరెడ్డి అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ ఆధ్వర్యంలో ఊరుసుగుట్ట ప్రాంతంలోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా లయన్ క్వెస్ట్ కన్వీనర్ లయన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. మానవ వనరుల సద్వినియోగం వారి నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుందని.. కాబట్టి భారతదేశం లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో లయన్ క్వెస్ట్ ప్రోగ్రాం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యువతీ యువకులు పెడదారి పట్టకుండా సరైన మార్గంలో నడుచుకునేందుకు ఈ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

అనంతరం గౌరవ అతిథిగా హాజరైన మల్టిపుల్ కౌన్సిల్ క్వెస్ట్ ప్రోగ్రాం ప్రాజెక్టు మేనేజర్ లయన్ శివప్రసాద్, జ్యోతిబాపులే పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ వై మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని విషయాలు నేర్చుకొని వెళ్లి మీ పాఠశాలల్లో విద్యార్థుల్లో మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్న ఈ పాఠశాలల్లో వారి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడే ఈ క్వెస్ట్ ప్రోగ్రాం ను ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి అభినందనలు తెలిపారు. జ్యోతిబాపూలే కాలేజీ విద్యార్థులు గత సంవత్సరంలో రాష్ట్ర ర్యాంకులు సాధించిన 14 మంది విద్యార్థులను లయన్ డాక్టర్ రాజలక్ష్మి, లయన్ మార్గం ప్రభాకర్, లయన్ రవీందర్ రెడ్డి లు విద్యార్థులను అభినందించి, సన్మానించి నగదు పారితోషకమును అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ కుందూరు వెంకటరెడ్డి, మొదటి ఉపగవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, ప్రోగ్రాం అసిస్టెంట్ కోఆర్డినేటర్ లయన్ పరికిపండ్ల వేణు, తదితరులు హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జ్యోతిబాపూలే 37 పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Tags:    

Similar News