తల్లి బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కొమ్మానబోయిన వేణు యాదవ్

తల్లి బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని కొత్తగూడ మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు యాదవ్ అన్నారు.

Update: 2022-12-25 13:10 GMT

దిశ, కొత్తగూడ: తల్లి బిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కొత్తగూడ మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ కొమ్మాన బోయిన వేణు యాదవ్ అన్నారు. ఆదివారం కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ అంగన్వాడీల టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బీఆర్ఎస్ కేవీ అనుబంధం సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కె.రాజలక్ష్మి అధ్యక్షతన ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి మాట్లాడుతూ.. ఐక్యత-సాధన నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీలను పిలిచి భోజనం పెట్టి 3 సార్లు వేతనం పెంచారని, టీచర్ అనే గౌరవం ఇచ్చారని తెలిపారు. 47 సంవత్సరాలుగా అంగన్వాడీలో సేవలు అందిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక పెన్షన్స్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News