దొంగే దొంగ అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది : ఎమ్మెల్యే నాయిని

దొంగే దొంగ అంటుంటే ఆశ్చర్యం వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-10 16:36 GMT

దిశ, హనుమకొండ : దొంగే దొంగ అంటుంటే ఆశ్చర్యం వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చోరీ బాబా డజన్ లెక్క మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి బయలు దేరినవా కేటీఆర్..? అని ప్రశ్నించాడు. ఉన్నత చదువులు అని చెప్పుకునే నువ్వు నీ బాషే నీ సంస్కారాన్ని తెలుపుతుంది, అధికారం పోయిన కూడా నీ భాష మారలేదు, యాస మారలేదు అని అన్నారు. 10 ఏళ్లలో ప్రళయలు సృష్టిస్తే 10 నెలలుగా ప్రక్షాళన చేస్తున్నాం, ఉప ఎన్నికల కోసం హుజురాబాద్ లో దళిత బంధు ఇచ్చి మిగిలిన నియోజకవర్గాలకు మొండిచేయి చూపింది మీరు కదా.? అని ప్రశ్నించాడు. “ సూటిగా అడుగుతున్నా కేటీఆర్ దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయలేదు, హుజురాబాద్ ఎమ్మెల్యే నటనకు ఆస్కార్ తప్పకుండా ఇవ్వాలి అని, నువ్వు కూర్చొని మీడియాతో మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ భవనానికి ఇంటి పన్ను కడుతున్నారా” అని అన్నారు. మీ పార్టీ కార్యాలయ నిర్మాణ అనుమతులు ఉన్నాయా..?, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నదికి పునర్జీవనం తెస్తున్న ప్రభుత్వం పై అవక్కులు చేయడం హేయమైన చర్య అన్నారు.

తప్పకుండ బుల్డోజర్లతో గడిలను, ఫార్మ్ హౌస్ లను కులాగోడుతాం, గతంలో వరంగల్ జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చావు, ఉద్యమ కాలంలో నీ ఇంట్లో ఎంత మంది మరణించారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళను రప్పించి చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు ప్రజలకు చూపించడం లేదు, దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైంది, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న మాట ఏమైంది అని ప్రశ్నించారు. పట్టుమని ఏడాది కాకముందే ప్రభుత్వంపై అక్కసుతో విషపూరిత పదజాలాలు ఉపయోగిస్తున్నావు కదా.!, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షం అడిగే స్వేచ్ఛ లేదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ మరీ ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేసినవు అని అడుగుతున్న సమాధానం చెప్పు అన్నారు. కులాల వారిగా లెక్కలు చెప్పే అర్హత నీకు లేదు కేటీఆర్, గొర్రెల పంపిణి లో జరిగిన అవినీతి మర్చిపోయావ అని, డబల్ బెడ్ రూమ్ లలో తీసుకున్న డబ్బులు గుర్తుకు లేవా అని అన్నారు. కులగణన సర్వే వలన ఈ రోజు అన్ని కులాలకు సమన్యాయం, రాజకీయంగా సముచిత స్థానం, ఆర్థిక, సామాజిక లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం చూస్తుంది, కులగణన పట్ల మేధావి వర్గం ప్రభుత్వంపైన హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రజలను రెచ్చగోడితే రెచ్చిపోయే స్థితిలో లేరు కేటీఆర్, మీ మాటలకూ విలువలిచ్చే రోజులు లేవు అన్నారు. ఈ నెల 19 తేదీ రెండు రోజులు ఆటో ఇటో తరువాత సమగ్ర ఆధారాలతో, అభివృద్ధి అంశాలపై మీడియా ముఖంగా వెల్లడిస్తా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అభివృద్ధి పై వివరణ ఇవ్వండి అన్నారు. నీ అయ్యా, నీది, నీ బావ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, మా నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, ఈ రోజు మా ప్రభుత్వ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయానికి రెక్కలు వచ్చాయి, అండర్ డ్రైనేజ్ పనులకు డిపిర్ సిద్ధం అయ్యింది, ఖాజిపేట బ్రిడ్జి పనులకు ఊతం తీసుకుని వచ్చాము అన్నారు.

వరంగల్ ప్రజలారా దయచేసి దొంగల మాటలు నమ్మవద్దు, నాలుగు కాలాలపాటు సమగ్రాభివృద్ధి జరగాలన్న, సమస్యలు పరిష్కారం కావాలన్నా బి ఆర్ ఎస్ నాయకుల మాటలను నమ్మవద్దని అన్నారు. గత పాలకుల లాగా సమస్యలను చూసి పారిపోము, పదేళ్లు నమ్మి గోస పడ్డారు, మళ్ళీ వారిని దరిదాపుల్లో కూడా ఉండనివ్వద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొద్ది రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఆనంద్, పులి అనిల్, కార్పొరేటర్ లు జక్కుల రవీందర్, విజయ శ్రీ, పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు అబూబాకర్, బోడ డిన్న, మాదవి రెడ్డి, నాసిమ్ జహాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News