పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను : ఈటల
పార్టీ ఆదేశిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ
దిశ,కమలాపూర్: పార్టీ ఆదేశిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ అన్నారు. అధికారం కట్టబెట్టేది ప్రజలేనని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. అధికారం ఉన్న, లేకున్నా ప్రజల అవసరాల కోసం గతంలో లాగా పనిచేస్తు ,ఎప్పటికీ అందుబాటులో ఉంటామని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో సురక్షితంగా ఉందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వదించి బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.