బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం.. హనుమాన్లఝాన్సీ రెడ్డి
కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.
దిశ, రాయపర్తి : కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. పల్లెపల్లెకు కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ పథకాలు ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కేశవపురం ఎర్రగుంట తండా, జింకురాం తండా, ఆరెగూడెం, కొల్లంపల్లి, బురహానుపల్లి గ్రామాలలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించారన్నారు.
ఇది చూసి చలించి పోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి దోచుకుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనతో ప్రజలు విసుగుచెందారని కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఓటు వేయాలని ఆమె కోరారు. పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన కోడలు యశస్విని రెడ్డిని నియమిస్తున్నట్లు, ఆమెను ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఆదరించి గెలిపించినట్లైతే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని, ఆ భాగ్యం నాకు కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకన్న, సంది కృష్ణారెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి, కుందూరు విక్రం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.