పత్తి కాంటాలో చేతివాటం.. పట్టుబడిన దళారులు

పత్తి కొంటామని చెప్పి కాంటాలో చేతివాటం ప్రదర్శించి దళారులు

Update: 2024-10-18 10:55 GMT

దిశ, కమలాపూర్: పత్తి కొంటామని చెప్పి కాంటాలో చేతివాటం ప్రదర్శించి దళారులు అడ్డంగా రైతులకు దొరికిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అంబాల, పంగిడిపల్లి గ్రామానికి చెందిన యువకులు ట్రాలీలో ఊరురా తిరుగుతూ పత్తి వ్యాపారం చేస్తూ శుక్రవారం వంగపల్లి గ్రామంలో కొలిపాక కుమారస్వామి వద్ద పత్తి కొనుగోలు చేసి కాంట వేస్తున్నప్పుడు తూకంలో వ్యత్యాసాన్ని గమనించారు.

రైతు యువకుడిని ప్రశ్నించి యువకుడి జేబులలో పరిశీలించగా రిమోట్ కంట్రోల్ తో కాంటాను ఆపరేట్ చేస్తున్నట్టు గమనించారు. సుమారు తూకంలో 10 కిలో గ్రాములు తేడా ఉన్నట్లు గమనించి రైతు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం సీఐ హరికృష్ణ తూనికలు కొలతలు శాఖ అధికారులకు సమాచారం అందించగా తూకాలలో జరుగుతున్న మోసాల గురించి తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీలత ప్రత్యక్షంగా రైతులకు చూపించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ దళారుల నమ్మి మోసపోవద్దని సూచించడం కాకుండా ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకోబడతాయని అధికారులు తెలిపారు.


Similar News