నీటి సరఫరాపై నిర్లక్ష్యంగా ఉండొద్దు: జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్య

నీటి సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్య...GWMC Commissioner Review meeting with officials

Update: 2022-12-23 13:40 GMT

దిశ, వరంగల్ టౌన్: నీటి సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఫైళ్ళ పరిష్కరణ, పెండింగ్, నీటి సరఫరా తదితర అంశాలపై సర్కిళ్ల వారీగా కమిషనర్ సమీక్షి నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్ లో ఉండకుండా గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిపాలన పరమైన మంజూరు ఇచ్చిన పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని, పనుల ఎంబీ నమోదు సకాలంలో జరిగి, పెండింగ్ లేకుండా చూడాలని, ఏమైనా డివియేషన్ ఉంటే సంబంధిత కాంట్రాక్టర్ కు రెక్టిఫై నిమిత్తం నోటీసు జారీ చేయాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి బిల్లు ఎంబీ రికార్డు జరగాలని, అన్ని సర్కిళ్ల కార్యాలయాల్లో ఒకే రకమైన యూనిఫాం రేట్లు అమలు చేయలన్నారు.

కాంట్రాక్టర్లు సకాలంలో చేయని పనులను రద్దు చేయాలని, రద్దు చేసిన పనులకు జాప్యం జరుగకుండా వెంటనే తిరిగి టెండర్ పిలవాలని సూచించారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించకుండా సక్రమంగా జరిగేలా ఏఈలు క్షేత్రస్థాయిలో ప్రతి రోజు పర్యటించి ఉత్పన్నమయ్యే లీకేజీలు, ఇంటర్ కనెక్షన్ పనులు, డ్యామేజ్ పైపులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని, దీనికి సమాంతరంగా సివిల్ పనులపై కూడా దృష్టి సారించి సకాలంలో పూర్తి జరిగేలా నిత్యం పర్యవేక్షించాలన్నారు. క్వాలిటీ కంట్రోల్ సంబంధ ఫైళ్ళ నిర్వహణ ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా జరగాలని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు కృష్ణ రావు, ప్రవీణ్ చంద్ర, ఈఈలు రాజయ్య, బిఎల్ శ్రీనివాస్, అకౌంట్ అధికారి సరితా, ఐటీ మేనేజర్ రమేష్, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News