గీత కార్మికులు రక్షణ కిట్లను ఉపయోగించుకోవాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
కల్లు గీత కార్మికుల ప్రాణారక్షణకు అందిస్తున్న కాటమయ్య రక్షణ
దిశ,జనగామ : కల్లు గీత కార్మికుల ప్రాణారక్షణకు అందిస్తున్న కాటమయ్య రక్షణ కవచాలను సద్వినియోగం చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..గీత కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం కిట్లు అనేక విధాలుగా దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిత్యం ఏదోక చోట గౌడ కార్మికులకు ప్రమాదాలు సంభావిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి గౌడన్నలకు రక్షణ కవచం ఉపయోగం పడుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో ఆబ్కారి శాఖ అధికారులు ,గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.