గంగారం తహశీల్దార్ సస్పెండ్
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గంగారం తహశీల్దార్ సూర్యనారాయణపై... Gangaram MRO suspended
దిశ, కొత్తగూడ: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గంగారం తహశీల్దార్ సూర్యనారాయణపై వేటు పడింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక గంగారం తహశీల్దార్ ని సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముందుగా భూ సర్వే చేపట్టే కార్యక్రమంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు తేలింది. విచారణ చేపట్టిన అనంతరం విధులు నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేశారు. విధులు పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతానికి డిప్యూటీ తహశీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పద్మావతికి గంగారం తహశీల్దార్ గా బాధ్యతలు అప్పజెప్పారు.