ప్రజావాణి కి 175 దరఖాస్తులు..
వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
దిశ, హనుమకొండ : వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 175 దరఖాస్తులు కలెక్టర్ కు అందజేశారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్లాత్ బ్యాగులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, హన్మకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, సి పి ఓ సత్యనారాయణ రెడ్డి ఇతర జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.