జనం ఫుల్.. బస్సులు నిల్..బస్సులను అడ్డుకున్న ప్రయాణికులు

కిక్కిరిసిపోయే జనాలు.. కిటకిటలాడుతున్న బస్సులు.

Update: 2024-10-14 13:21 GMT

దిశ,తొర్రూరు: కిక్కిరిసిపోయే జనాలు.. కిటకిటలాడుతున్న బస్సులు.దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తెలంగాణ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారనీ,గురువారం వరకు రాత్రి 10 గంటల వరకు వెయ్యికిపైగా ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీ జిల్లాలకు తరలి వెళ్లాయని అధికారులు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబరు 13, 14వ తేదీల వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో తొర్రూరు బస్టాండ్ లో హైదరాబాదుకు వెళ్లడానికి జనాలు గంటల సేపు నిలబడిన ఏ ఒక్క బస్సు వేయకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొర్రూరు నుండి ఉప్పల్ వరకు బస్సులు వేసేంతవరకు బస్టాండ్ నుండి ఏ ఒక్క బస్సు , కదలనియమని ప్రయాణికులు ధర్నా చేపట్టారు. విశేషమేమిటంటే ప్రయాణికులే బస్సులను అడ్డుకోవడం గమనార్హం. గొడవ చేస్తున్న ప్రయాణికులను.. ప్రత్యక్షంగా చూస్తున్న ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికులను అడ్డుకోకుండా నిలబడడం విశేషం.


Similar News