నల్లబెల్లి పోలీస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-10-13 09:32 GMT

దిశ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ధరణి రూమ్ నుండి కేకలు వినబడడంతో తోటి సిబ్బంది వెళ్లి చూడగా ఆమె మంటల్లో చిక్కుకొని ఉంది. దాంతో ఆమెను బయటకు తీసుకొచ్చి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా ఉండొచ్చా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని ఇన్​చార్జ్ ఎస్ఐ రాజేష్ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News