విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

దసరా పండుగ సెలవులు ముగించుకొని తిరిగి బడులు,వసతి

Update: 2024-10-15 12:25 GMT

దిశ,డోర్నకల్ (కురవి) : దసరా పండుగ సెలవులు ముగించుకొని తిరిగి బడులు,వసతి గృహాలకు వస్తున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు.మంగళవారం కురవి మండల పరిధిలో ఏకలవ్య,మోడల్, రెసిడెన్షియల్,ఆశ్రమ,హైస్కూలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర,అంగన్ వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల తరగతి గదులు,హాస్టల్ రూమ్స్,డైనింగ్ హాల్స్,స్టడీ రూమ్స్,మరుగుదొడ్లు,త్రాగు నీరు,విద్యుత్, తదితర అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలన్నారు.సీజనల్ వ్యాధులు,సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని,ఆశ,ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు.ఆరోగ్యం,పరిశుభ్రత,పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల ప్రత్యేక అధికారులు పాఠశాలలు,వసతి గృహాలు తనిఖీ,విద్య,వైద్యం,సానిటేషన్,ఆరోగ్యం తదితర సౌకర్యాలపై ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.


Similar News