మండపాకలో మట్టి మాఫియా

మ‌ట్టి మాఫియా చీక‌టిని అనువుగా చేసుకుని అక్రమంగా మ‌ట్టిని త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటుంది.

Update: 2023-04-09 01:59 GMT

దిశ, ఏటూరునాగారం: మ‌ట్టి మాఫియా చీక‌టిని అనువుగా చేసుకుని అక్రమంగా మ‌ట్టిని త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటుంది. రోజు అర్ధరాత్రి స‌మ‌యంలో జేసీబీ, టిప్పర్, లారీలు, ట్రాక్టర్ల ద్వా రా మ‌ట్టిని త‌ర‌లిస్తూ మ‌ట్టి దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా కొన‌సాగిస్తున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా  వాజేడు మండ‌లం ముళ్లక‌ట్ట స‌మీప గ్రామం మండపాక‌లో రోజు రాత్రి స‌మ‌యంలో కొందరు అక్రమార్కులు జేసీబీ, టిప్పర్ , ట్రాక్టర్ల స‌హాయంతో మ‌ట్టిని త‌ర‌లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చ‌ప్పుడు కాకుండా జేసీబీ త‌ర‌లించే అన‌వాళ్లు కూడా తెలియ‌కుండా మ‌ట్టి త‌వ్వే ప్రాంతానికి జేసీబీ మిష‌న్‌ను ట్రాలీ ట్రక్కుపై తీసుకోని వెళ్లి మ‌ట్టిని కొల్లగొట్టిన తరువాత మ‌ళ్లీ అదే వాహ‌నంలో జేసీబీ మిష‌న్‌ను గమ్యస్థానానికి చేరుస్తున్నారు.

తెలిసే జ‌రుగుతుందా...?

రోజు అర్దరాత్రి స‌మ‌యంలో మండ‌పాక జాతీయ ర‌ హ‌దారి ఎన్‌హెచ్ హైవే 163 కు పక్కనే అ క్ర మంగా మ‌ట్టి త‌ర‌లింపు జ‌రుగుతున్నా విష‌యం స‌ద‌రు మైనింగ్‌, రెవిన్యూ శాఖ అధికారులు స్పందించ‌క‌పోవ‌డంపై ప‌ట్ల వారి క‌నుసన్నల్లోనే అ క్రమంగా మ‌ట్టి త‌ర‌లింపు కొన‌సాగుతున్నట్లు గా స్థానిక ప్రజ‌లు అంటున్నారు. మ‌ట్టిని కొల్లగొడుతున్న విషయాన్ని స్థానికంగా ఉన్నవారు మండ‌ల స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లిన మే ము చ‌ర్యలు తీసుకుంటాం అనే మాట‌లు మా త్రమే అంటున్నారని చ‌ర్యలు మాత్రం శూన్యంగా క‌న‌బ‌డుతున్నట్లు స‌మాచారం.

గ‌తంలో ఇసుక ఇప్పుడు మ‌ట్టి..

గతంలో ఈ మ‌ట్టి మాఫియానే ముళ్ల క‌ట్ట బ్రిడ్జి వ‌ ద్ద గోదావ‌రి నుంచి ఇసుక‌ను రాత్రి స‌మ‌యంలో అక్రమంగా త‌ర‌లించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాగా కొంత కాలంగా రెవెన్యూ అధికారులు గోదావ‌రిలో అక్రమంగా ఇసుక తీస్తున్న వారీపై శాఖ ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. దీంతో ఇసుక దందా నుంచి అక్రమ మ‌ట్టి వ్యాపారం వైపు ఈ మాఫియా మారినట్లు స‌మాచారం. అక్రమంగా కొల్లగొట్టిన మ‌ ట్టిని స్థానికంగా ఒక క్రషర్​ కంపెనీలో డంప్ చేసి త‌మ‌కు అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో మ‌ట్టిని టిప్పర్లలో త‌ర‌లించి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రైవెట్ సైన్యం...

నిబంధన‌ల‌కు వ్యతిరేకంగా మ‌ట్టిని కొల్లగొడుతున్న మాఫియా త‌మ‌ వ్యాపారానికి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు మ‌ట్టి తీసే స‌మ‌యంలో స‌మీప ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ద్విచ‌క్ర వాహ‌నాంపై తిరుగుతూ అధికారులు వ‌స్తున్నరా.. అనే స‌మాచారాన్ని జేసీబీ డ్రై వ‌ర్‌కు చేర‌వేస్తుంటారు. ఇంకో ఇద్దరు ము ళ్ల కట్ట బ్రిడ్జి పై ప‌హారా కాస్తారు. ఎవరైనా మ‌ట్టి తీస్తున్న వైపు వెళ్తున్నట్లు వీరికి క‌నిపిస్తే వెంట‌నే రంగంలోకి దిగి బెదింరింపు చ‌ర్యలకు పాల్పపడుతారు.. అవ‌స‌రం అయితే దాడుల‌కు పాల్పపడుతారు.

చ‌ర్యలు తీసుకోవాలి

నిత్యం నిబంధనలకు విరుద్ధంగా మ‌ట్టిని త‌ర‌లిస్తూ మాఫియా అధికారులపై ఇప్పటికైనా దృష్టి సారించి వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

మాఫియా జోలికి ఎవరూ వెళ్లరు

అక్రమంగా మ‌ట్టిని కొల్లగొడుతున్నా మ‌ట్టి మా ఫియా జోలికి ఎవరూ వెళ్లే ధైర్యం చేయ‌ర‌ని వారికి కొంత మంది నాయ‌కుల‌, మం డ‌ల స్థాయి అధికారుల అండ‌దండ‌లు దం డిగా ఉన్నాయ‌నే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవ‌రైనా ధైర్యం చేసి స‌ద‌రు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారిపై వేరే ర‌కంగా ప్రతీకార చ‌ర్య చూపించ‌డం మ‌ట్టి మా ఫియాకు వెన్నతో పెట్టిన విద్య అనే అరోప‌ణాలు ఉన్నాయి.

Tags:    

Similar News