అమిత్ షా ను వెంటనే బర్తరఫ్ చేయాలి- ఎంపీ
పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
దిశ, జనగామ : పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను వెంటనే బర్త్ రఫ్ చేసి, జాతికి బేషరతుగా మోడీ, అమిత్ షా లు క్షమాపణలు చెప్పాలి అని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు కొమ్మూరి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టి, సంపదను అంబానీ ఆదానిలకు దోచి పెడుతూ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో తినే తిండి పైన, కట్టుకునే బట్టపై ఆంక్షలు విధిస్తూ ప్రజల మధ్య వైశ్యామ్యాలను రెచ్చగొడుతున్నారు.
ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలపై హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని,స్వతంత్ర సంస్థలైన సీబీఐ , ఈడీ, ఎన్నికల కమిషన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం కంటే సనాతన ధర్మమే గొప్పది అనే దుష్ప్రచారానికి సంఘ పరివార్ ను మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. బహుజనుల ఆశాజ్యోతి అయిన డాక్టర్ అంబేద్కర్ ను తలుచుకుంటే ఏమొస్తుంది, దేవున్ని తలుచుకుంటే పుణ్యం వస్తుంది అంటూ అవాకులు చెవాకులు పేల్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటల వెనుక ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండా దాగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
ప్రతిపక్షాలు ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో విఫలమయిందని విమర్శిస్తారు అనే భయంతోనే వారికి అనుకువగా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడే విధంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ.. దేశ సంపద దోచుకుంటున్న అతని,అంబానీలను ప్రోత్సహిస్తున్నారు.ఒక్క అంబేద్కర్ నే కాదు మహనీయులను ఎవరిని కించపరిచిన ఊరుకునేదే లేదు, రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బిజెపి పార్టీకి, నాయకులకు తగిన గుణపాఠం చెబుతారు అని ఈ సందర్భంగా హెచ్చరించారు.