మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత : జిల్లా ఎస్పీ శబరిష్

మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా

Update: 2024-06-26 15:16 GMT

దిశ,ములుగు ప్రతినిధి: మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో ములుగు ఏరియా హాస్పిటల్ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ టీ ఎస్ దివాకరా పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లాలో గల వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలావరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవే అని, మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉజ్వల భవిష్యత్తుని కోల్పోతున్నారని, యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుందని, చెడు అలవాట్లను ప్రయత్నించకూడదు మంచి అలవాట్లను మాత్రమే ప్రయత్నించాలని తద్వారా ఉన్నత స్థాయికి రాగలుగుతారని తెలియచేసారు.

ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ముందస్తుగా డ్రగ్స్ ను కట్టడి చేయడం నివారించడం నిర్ములించడం అని, గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా ఎక్కడైతే ఉంటుందో సరైన విధంగా సమాచారాన్ని రాబట్టడం, విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేయడం జరుగుతున్నదని కాలేజీలు స్కూల్స్ వంటి ప్రాంతాల్లో పోలీస్ నిఘా ను ఉండడం జరిగితున్నదని ,స్కూల్ కాలేజీలలో ఆంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. అందరూ కలిసి పని చేస్తే మాదకద్రవ్య రహిత సమాజంగా మార్చవచ్చునని ప్రతి ఒక్కరు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక సైనికుని వలె పోరాడాలని కోరుతూ పోలీస్ శాఖకు సహకరించగలరని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఏటూర్ నాగారం ఎస్పీ మహేష్ గితే, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, డి ఎస్ పి ములుగు రవీందర్, సీఐ ములుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News