దిశ, వరంగల్ : వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరరేందర్ పై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో నవజాత శిశువును రెండు రోజుల క్రితం కుక్కలు పీక్కుతిన్న ఘటనపై మాజీ ఎమ్మెల్యే నరేందర్ నిరసన తెలిపారు. అయితే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అధిక సంఖ్యలో జనాలను గుంపులుగా తీసుకెళ్లి హాస్పటల్లోని సిబ్బంది, డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించే విధంగా నిరసన చేపట్టారని పోలీసులు అంటున్నారు. ఆ నిరసనను తప్పుబడుతూ ఆదివారం కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. A1గా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, A2గా 34వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి, A3గా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, A4గా 37 డివిజన్ కార్పొరేటర్ రిజ్వానా షమీమ్, A5గా కొంగరం రాజేందర్, A6గా ఎలగంటి సతీష్ మాజీ దుర్గేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్, A7గా ఎలగంటి మధు, A8గా సీతారాం, A9గా బజ్జూరి వాసు, A10గా తోట స్రవంతిని చేర్చారు.