మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు
దిశ,రాయపర్తి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో చేప పిల్లలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా చెరువులలో ప్రభుత్వం ఉచితంగా చేపలను పంపిణీ చేస్తుందన్నారు. ఈ చేపల పంపిణీ వలన మత్స్యకారుల జీవన భృతి పెరిగి వారు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల వారికి సముచితంగా ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తున్నారన్నారు.
మండలంలోని 83 చెరువులలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 15 లక్షల 26 వేల చేప పిల్లలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులతో పాటు తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, మాచర్ల ప్రభాకర్, పెండ్లి మహేందర్ రెడ్డి, రెంటాల గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఏసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉల్లెంగుల యాదగిరి, సుదర్శన్ రెడ్డి, కాజా మియా, మంద యాకూబ్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.