పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు..: వరంగల్ సీపీ

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించి పోలీసు అమరవీరులను

Update: 2024-10-19 14:48 GMT

దిశ, హనుమకొండ : శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అశోక జంక్షన్ నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లోని అమరవీరుల స్థూపం వద్ద చేరుకోని అమరవీరులకు నివాళులు అర్పించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నక్సలైట్ల చేతిలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు వృధా పోవని, వారి త్యాగాల ద్వారా నేడు ప్రశాంత వాతావరణం నెలకొందని, అలాగే అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 21వ తేది నుంచి 31 తారీఖు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రవీందర్ , అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్, రవితో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు , ఆర్ఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది,పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు, జాగృతి కళాబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News