గొల్ల కురుమల ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధనకే గొర్రెల పంపిణీ : ఎమ్మెల్యే అరూరి
గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి
దిశ, హనుమకొండ టౌన్ : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ రాంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు 21లక్షల విలువ చేసే 12యూనిట్ల గర్రెలను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీతో, 25 శాతం లబ్ధిదారని వాటాతో గొర్రెలను లబ్ధిదారులకు అందజేస్తుంన్నారని తెలిపారు.
మాంసం ఉత్పత్తులు కు భారీ డిమాండ్ ఉందని, తెలంగాణ రాష్ట్రంలో మాంసం దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతొందని పేర్కొన్నారు. గొర్ల కాపరులు గొర్రెలను మంచిగా పెంచి, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. గొర్రె కాపరులు ఈ పథకాన్ని సద్వినియోగపరచుకొని ఆర్థికంగా బలపడే విధంగా గొర్రెల పెంపకం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అరూరికి అభినందనల వెల్లువ..
మూడవసారి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అరూరి రమేష్ ని ప్రకటించిన సందర్భంగా మంగళవారం హన్మకొండ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాపై నమ్మకంతో మరొకసారి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి ధన్యవాదాలు తెలుపుతూ నా వెంట ఉండి అనుక్షణం నాతో నడిచిన ప్రతి కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింత ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది.