హాస్టల్ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి..: సీపీ అంబర్ కిషోర్ ఝా
ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని
దిశ,హనుమకొండ : ప్రైవేట్ హాస్టల్స్ తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులతో స్థానిక భీమారంలోని శుభం కళ్యాణ వేదిక లో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. ఇందులో ప్రధానంగా హాస్టల్ వచ్చి పోయే వారి వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలని, అలాగే హాస్టల్ వారి దినచర్య పై నజర్ పెట్టాలని,రాత్రి సమయాల్లో వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించవద్దని, వీరి కోసం వచ్చే వారి గురించి తగిన సమాచారం తీసుకోవాలని, స్థానిక పోలీసుల సహకారం తీసుకోనే విధంగా యాజమాన్యం ఈనెల 31 తారీఖులో తగు చర్యలు తీసుకోవాలని, జనవరి నుంచి హాస్టల్స్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, సూచనలు పాటించని హాస్టల్స్ పై చర్యలు తీసుకోబడుతాయని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం ఎఎస్పీ భట్, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సతీష్, రవి కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్ హాస్టళ్ల గురించి గతంలోనే చెప్పిన దిశ..
ప్రైవేట్ హాస్టల్స్ దందా..! అనే శీర్షికతో సెప్టెంబర్ 22 న నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల దందా, హాస్టల్స్ లో నిబంధనలు లేకుండా నడుపుతున్న హాస్టల్స్ గురించి దిశ సెప్టెంబర్ 22 న ప్రచురించింది. సీసీ కెమెరాలు లేకుండా నడుపుతున్న యజమానులపై నేడు సీపీ ప్రైవేట్ హాస్టల్స్ యాజమానుల కు అవగాహన సదస్సు నిర్వహణలో ప్రైవేట్ హాస్టల్స్ యజమానుల పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేట్ హాస్టల్స్ తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలతో హాస్టల్స్ నడపాలని, సీసీ కెమెరాల ఈ నెల ఆఖరి లోపు అమర్చాలని డెడ్ లైన్ పెట్టడం అంతే కాకుండా జనవరి నెలలో తనే స్వయంగా రంగంలోకి దిగి ప్రైవేట్ హాస్టల్స్ ను తనిఖీలు నిర్వహిస్తామని తెలపడం గమనార్హం.