ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ఢీ…వ్యక్తి మృతి
మండలంలో సాయంత్రం నక్కవాని గూడెంకు చెందిన గుంటిపల్లి యాదగిరి తన ద్విచక్ర వాహనంపై సొంత
దిశ,బచ్చన్నపేట: మండలంలో సాయంత్రం నక్కవాని గూడెంకు చెందిన గుంటిపల్లి యాదగిరి తన ద్విచక్ర వాహనంపై సొంత పనిపై చిన్న రామంచర్ల వైపు వెళ్తుండగా బచ్చన్నపేట కు చెందిన శివరాత్రి వెంకటేష్ అనే అతను తన ట్రాక్టర్ పై కేజీబీల్స్ వేసుకొని అతివేగంగా వస్తుండగా అవి తగిలి సదరు యాదగిరి అక్కడికక్కడే తలకు గాయమై మరణించినాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బచ్చన్నపేట ఎస్ఐ ఎస్.కె హమీద్ తెలిపారు.