పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం, రమణక్కపేట గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Update: 2024-12-19 14:58 GMT

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం, రమణక్కపేట గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని తల్లి తెలిపిన వివరాల మేరకు.. యధావిధిగా స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థిని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తన పనులు తాను చేసుకొని స్కూల్‌కి వెళ్లేందుకు సిద్దమైందని విద్యార్థిని తల్లి తెలిపింది. ఇంతలో ఏమైందో ఏమో తెలియడం లేదని, ఇంటి బయట కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి ఏం చేయాలో అర్థం కాలేదని తల్లి కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Similar News