వివాదంలో ఫారెస్ట్ పోలీసులు.. సారాలమ్మ గుడిని కూల్చీవేడంతో తీవ్ర ఉద్రిక్తత(వీడియో)
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో శనివారం జాతీయ రహదారిపై ఆదివాసీలు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలో శనివారం జాతీయ రహదారిపై ఆదివాసీలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గత 70 సంవత్సరాలుగా వంశపారపర్యంగా తామ ఇలవేల్పుగా కొలుచుకుంటున్న సారాలమ్మ గద్దెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
తాడ్వాయి మండలం కాటాపురం గ్రామం వెళ్లే మార్గం మధ్యలో సారాలమ్మ గుడి గద్దె ఉంది. ప్రతి జాతరకు ముందు ఆనవాయితీగా అమ్మవారికి కొత్త గుడిసే వేసి పూజాలు నిర్వహించి అమ్మవార్లను కోలుచుకుంటారు. అయితే ఈ క్రమంలోనే.. ఈ సంవత్సరం కూడా అమ్మ వారి గుడిసె వద్ద అదే స్థానంలో అమ్మవారి గద్దెను గత మూడు రోజులుగా క్రితం నిర్మాణం చేపట్టామని ఆదివాసీలు తెలిపారు. కాగా.. మూడు రోజుల క్రితం అటవీ శాఖ సిబ్బంది వచ్చి ఇక్కడ గద్దె కట్టకూడదని అడ్డుపడ్డారని.. శనివారం వచ్చి చూసే సరికి అధికారులు సారాలమ్మ గద్దెను కూల్చీ వేశారని వారు తెలిపారు.
తమకు న్యాయం జరగాలని అదివాసీలు పెద్ద ఎత్తున్న తాడ్వాయి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై 'దిశ' మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావును ఫోన్ ద్వారా సంప్రందించాగా.. అటవీశాఖ అధికారులు కట్టిన గద్దెను కూల్చీవేశారని, ఎవరు ఏం చేసినా కార్యక్రమాలన్ని యథావిధిగా సాగుతాయని తెలిపారు.