Collector : భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్
ఎలక్షన్ పిటిషన్ పీరియడ్ పూర్తయ్యే వరకు భద్రతా సిబ్బంది
దిశ,వరంగల్ టౌన్ : ఎలక్షన్ పిటిషన్ పీరియడ్ పూర్తయ్యే వరకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. ఎనుమాముల మార్కెట్ యార్డులోని 11వ నెంబర్ గోదాంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం స్ట్రాంగ్ రూములను, డిస్టిక్ వేర్ హౌజ్ ను, రిపేర్లు అండ్ ట్రైనింగ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూములను గురువారం కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద లాగ్ బుక్, సీసీ కెమెరా పర్యవేక్షణ తో పాటు వాచ్ రూమ్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ పిటిషన్ పీరియడ్ పూర్తయ్యే వరకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కాల వ్యవధి పూర్తయిన తదుపరి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వేర్ హౌస్ కు తరలించి భద్రతతో ఉండడం జరుగుతుందన్నారు.
అంతకుముందు మార్కెట్ లోని పల్లి, పసుపు యార్డులను సందర్శించిన కలెక్టర్ అక్కడ ఉన్న సరుకులను, వేమెంట్ మిషన్ లను పరిశీలించారు. పంట దిగుబడి,పసుపు,పల్లికాయ యొక్క క్వింటాళ్ల ధర తదితరుల విషయలు నేరుగా కలెక్టర్ శారద దేవి రైతులను అడిగి తెలుసున్నారు. మార్కెట్ లో రైతులకు అవసరమైన సౌకార్యాలకు లోటు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. కూరగాయల మార్కెట్ నిర్వహణ తీరుపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా జరగకుండా చూసుకోవాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాద్ రావు, మార్కెట్ కార్యదర్శి పోలే పాక నిర్మల,తహసీల్దార్ ఇక్బాల్ గ్రేడ్ 2 కార్యదర్శి రాము, ఏఎస్ రాజేందర్, అకౌంటెంట్ రాజకుమార్, సూపర్వైజర్ తుమ్మల సాగర్ తదితరులు పాల్గొన్నారు.