వీధి కుక్కలతో జంకుతున్న పిల్లలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది.

Update: 2024-07-06 12:26 GMT

దిశ,జనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వీధి కుక్కల బెడద తప్పే దెన్నడు..వీధుల్లోకి వెళ్లాంటే జంకుతున్న జనం ద్విచక్ర వాహనదారుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అంటు ప్రజలు వాపోతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

జిల్లాలోని పలు మున్సిపాలిటీలలోని వార్డులో కుక్కల బెడద ఎక్కువవుతోంది. గతంలో మున్సిపాలిటీల్లో కుక్కలను బందించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోకపోవడం తో కుక్కల సంతతి సైతం పెరిగింది. కుక్కలు దాడులు చేస్తుండడంతో పలువురు గాయాలపాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. రహదారుల వెంట వెళ్లే ప్రజలు, మూగజీవాలు, పశువుల పైకి కుక్కలు పరుగులు తీసి దాడులు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంట కుక్కలు వెంబడి వస్తుండడంతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. నెహ్రూ పార్క్, ఏబీవీ జూనియర్ కాలేజీ తో పాటు కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే వారు కుక్కల బారిన పడి గాయాల పాలవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

జిల్లాలో దాదాపు సుమారు వెయ్యి వరకు కుక్కలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉంది. నెహ్రూ పార్క్ దగ్గరలోని పలు కాలేజీ స్కూల్ హోటల్స్ ఉన్నాయి.. చిన్న పిల్లలను స్కూలుకు తీసుకుని వెళ్లే తల్లిదండ్రులకు సైతం ఈ బాధలు తప్పడం లేదు..ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతం కుక్కలతో ఇబ్బంది పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో కుక్కల దాడికి గురై మృత్యువాత పడ్డచిన్నారులని వార్తలు సైతం వింటూ ఉన్నాం.. ఏదైనా జరుగుతూనే తప్ప అధికారులు చొరవ తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్న జనగామ ప్రజానీకం....మున్సిపాలిటీ అధికారుల చొరవ తీసుకుంటారా లేరా వేచి చూద్దాం..


Similar News