ఆకాశంలో తారాజువ్వల కనువిందు..

చెడు పై మంచిసాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయ దశమి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి.

Update: 2024-10-12 17:04 GMT

దిశ, జనగామ : చెడు పై మంచిసాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయ దశమి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు దసరా పర్వదినాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. విజయదుర్గా ఆలయ ప్రాంగణాల్లో జమ్మి చెట్టును ఏర్పాటు చేసి పురోహితులు ప్రత్యే క పూజలు నిర్వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషు లకు జమ్మి ఆకు పంచుకొని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అంగరంగ వైభోగంగా..

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో దసరా పర్వదిన వేడుకలు హుషారుగా సాగాయి. జనగామలో బతుకమ్మకుంటకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన తారాజువ్వల వెలుతురులో మైదానాలన్నీ మిరుమిట్లు గొలిపాయి. లక్షలాది మంది ప్రజలు పాల్గొని వేడుకలను తిలకించారు. జనగామలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొని రావణ వధను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు , మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Similar News