కవిత దీక్షకు మద్దతుగా ఢిల్లీకి బీఆర్ఎస్ నేతలు
రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు.
దిశ, కాటారం : రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష చేపట్టారు. కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి ఢిల్లీ వెళ్లి కవితకు మద్దతు పలికారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నారు.
మంథని నియోజకవర్గంలో కొన్ని నెలలుగా బీఆర్ఎస్ లో నారాయణరెడ్డి నియోజకవర్గస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పర్యటనలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన విమర్శలకు, జాగృతి అధ్యక్షురాలు కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం పై సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు చల్లా నారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండుసార్లు తీవ్రంగా ఖండించారు.