మంత్రి కేటీఆర్​ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

తెలంగాణ రాష్ర్టంలో పాలకులు అవినీతిమయంగా మారిపోయారని, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి బాధ్యుడైన మంత్రి కేటీఆర్​ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Update: 2023-04-14 16:23 GMT

దిశ, ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ర్టంలో పాలకులు అవినీతిమయంగా మారిపోయారని, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి బాధ్యుడైన మంత్రి కేటీఆర్​ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్​ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ దేశంలోని ప్రతిపక్ష కూటమికి చైర్మన్​ గా చేస్తే ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తానని ప్రకటించడం వెనుక భారీ అవినీతి దాగుందనేది స్పష్టం అవుతోందన్నారు. ఎన్నిలక్షల కోట్ల డబ్బులు ప్రజాదనాన్ని దోచుకున్నాడో ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్నికలే పరమావధిగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నారే తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, రాష్ర్టంలో మద్యం ఏరులైపారుతోందని, ముఖ్యమంత్రికి మహిళల గోస తగులుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని, దేశ ఎన్నికలు సరిపోయే ఖర్చును అవినీతి సొమ్ముతో కూడబెట్టారని, 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో ఆడుకున్న సీఎం కేసీఆర్​కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని అన్నారు. పోలీసుశాఖలో నియామకాలు తప్ప ఇప్పటివరకు ఏ శాఖలో నియామకాలు జరగలేదని, అదికూడా వారి భద్రతకే ఉపయోగిస్తునరన్నారు. ఖాకీ డ్రెస్సును అవమానపరచకుండా గులాబీ డ్రెస్సులు పంపిణీ చేయాలని సీఎంకు హితవు పలికారు. ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. పేపర్​ లీకేజీ కేసులో బాధ్యత వహిస్తూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేపట్టాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులు లీకేజీతో నష్టపోయారని, వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు.

నిరుద్యోగులకు అండగా నిలుస్తూ బీజేపీ రాష్ర్టఅధ్యక్షులు బండి సంజయ్​ నేతృత్వంలో పదిఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తున్నామని, ఈ నెల 15న ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్​ సెంటర్ వరకు నిర్వహించే నిరుద్యోగ మార్చ్​ ను యువత విజయవతం చేయాలని పిలుపునిచ్చారు. నెల రోజుల్లో హైదరాబాద్​ లో మిలియన్​ మార్చ్​ ను తలపించేలా నిరుద్యోగ మార్చ్​ పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ఇంచార్జి బైరెడ్డి ప్రభాకర్​ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, నియోజకవర్గ నాయకులు భూక్య జవహర్​లాల్​, భూక్య రాజు నాయక్​, కన్వీనర్​ సిరికొండ బలరాం, కొత్త సురేందర్​, విజయ్ యాదవ్, కట్ట సాయి కిరణ్, భూక్యా కృపాన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News