మందు బాబులకు అడ్డగా బిర్యానీ సెంటర్లు..

మద్యం ప్రియుల జల్సాలకు, ఆనందానిచ్చే రెస్టారెంట్లుగా బిర్యానీ సెంటర్లు మారిపోతున్నాయి.

Update: 2023-07-09 13:52 GMT

దిశ, తొర్రుర్ : మద్యం ప్రియుల జల్సాలకు, ఆనందానిచ్చే రెస్టారెంట్లుగా బిర్యానీ సెంటర్లు మారిపోతున్నాయి. తొర్రుర్ పట్టణంలో భోజన ప్రియులకు రుచికరమైన భోజనం అందించాల్సిన బిర్యాని అడ్డాలు.. బార్‌లు, రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. రోజురోజుకు విచ్చలవిడిగా బిర్యాని సెంటర్‌లు పెరిగిపోతున్నా అధికారుల పర్యవేక్షణ లేదు. బిర్యాని సెంటర్లు, దాబాల్లో వ్యాపారులు నాణ్యతను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తమ వ్యాపారదందాను సాగిస్తున్నారు. దాబాలు, బిర్యాని సెంటర్లలో కస్టమర్లకు అందించాల్సిన నాణ్యత, ప్రమాణాలను కొరవడిన తీరే ఇందుకు నిదర్శనం. ఇష్టానుసారంగా కస్టమర్లను ఆకర్షించే విధంగా బిర్యాని సెంటర్లను నిర్వహిస్తూ భోజనప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

రోజు కూలికి పని చేసే కార్మికులు, ప్రయాణికులు ఆకలితో హోటళ్లకు వెళితే ఇదే అదనుగా భావించి అందినకాడికి దండుకుంటున్నారు. వెరైటీల పేరుతో నాణ్యత లేని కూరలు, బిర్యాని, భోజనం పెట్టి వినియోగదారుల ఆయుషును తగ్గిస్తున్నారు. ఏ ఒక్క బిర్యాని సెంటర్లో సరైన వసతులు, సదుపాయాలు లేకున్నా ఇష్టానుసారంగం నడుపుతూ ఎలాంటి సూచికలు లేకుండా వ్యాపారం సాగిస్తుండటం విశేషం. దాబాలు, హోటళ్లలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ యథేచ్చగా వ్యాపారులు మద్యం, ఇతరత్రా సప్లై చేస్తున్నారు. మద్యం షాపులకు సమయపాలన ఉంటుంది కానీ బిర్యానీ సెంటర్లు దాబాలు, బెల్టుషాపుల్లో మాత్రం అన్నివేళల అందుబాటులో దొరకడం విశేషం.

ఎక్సయిజ్ అధికారుల జాడేది..

స్థానికంగా ఉండే ఎక్సయిజ్ అధికారులు కిరణ దుకాణాల్లో బిర్యాని సెంటర్లు, దాబాల్లో ఎలాంటి మద్యం దందా సాగిన తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వీటిల్లో మద్యం సేవించరాదని నిబంధన ఉన్న ఇష్టానుసారంగా మద్యం దందా సాగుతున్నా అధికారులు మాత్రం ఆ వైపు చూడటమే మానేసారు.

ప్రజలకు నాణ్యమైన బోజనం, ఇతర సదుపాయాలు అందడం కోసం ఏర్పాటు చేసిన షాపులలో మద్యం దొరకడం విడ్డురం కాగా తమకేమీ సంబంధం లేనట్టు ఎక్సయిజ్ అధికారులు చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం బిర్యానీ పాయింట్లు, దాబాలలో అడ్డగోలు మద్యం దందాపై ఆరా తీసి అడ్డగోలు దందాకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.

రెండు రోజుల్లో దాడులు చేస్తాం..

మేము బిర్యానీ సెంటర్లలో మరియు దాబాలలో రెండు రోజులలో దాడులు జరిపి వాటిపై చర్యలు తీసుకుంటాం.ఇకనుంచి దుకాణాల్లో బిర్యానీ సెంటర్లో మద్యం జరిపినచో కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags:    

Similar News