BIG BREAKING: మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం.. 50 వేలకుపైగా నేలకూలిన చెట్లు (ఫొటోలు)

ములుగు జిల్లా అడవుల్లో మంగళవారం రాత్రి సుడిగాలి (Tornado) బీభత్సం సృష్టించింది.

Update: 2024-09-04 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా అడవుల్లో మంగళవారం రాత్రి సుడిగాలి (Tornado) బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావంతో మేడారం-తాడ్వాయి (Medaram - Tadwai) ఫారెస్ట్ ఏరియాలోని భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 15 కిలో మీటర్ల మేర విస్తీర్ణంలో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. ఫారెస్ట్ అధికారుల తాజా సమాచారం ప్రకారం.. సుమారు 200 హెక్టార్ల మేర 50 వేలకు పైగానే చెట్లు నేలకూలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలి(Tornado)తో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చోటుచేసుకుంది. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ మేరకు అటవీ శాఖ సీసీఎఫ్‌ ప్రభాకర్‌, డీఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఇతర అధికారులు అడవిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

 


Similar News