కులగణన సర్వేకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు : బండి సంజయ్
కులగణన సర్వేకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు
దిశ, భీమదేవరపల్లి:- కులగణన సర్వేకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్ ,యువ మోర్చా మండల అధ్యక్షులు సింగం రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. కులగణన గురించి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వేను ఎందుకోసం వాడడం లేదని, కేసీఆర్ చేసిన అక్రమాల గురించి ఎందుకు వెలుగులోకి తీయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, లక్కిరెడ్డితిరుమల, దొంగల కొమరయ్య, మాచర్ల కుమార్, సదానందం, అంబిర్ కవిత, మేకల రాజు, కాలర్ వికాస్, సింగం రాజేందర్, వీరన్న శ్రీనాథ్, అజయ్, రాము, శ్రీకాంత్, సంజయ్, అఖిల్, శ్రీను, అంజి తదితరులు పాల్గొన్నారు.