పాఠశాల భూమి కబ్జాకు యత్నం..!
మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనం వెనుక ఉన్న భూమిని కబ్జా చేసేందుకు పాఠశాల గోడ కూల్చినట్లు ప్రధానోపాధ్యాయురాలు పొదెం మేనక ఆరోపించారు.
దిశ, మంగపేట : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనం వెనుక ఉన్న భూమిని కబ్జా చేసేందుకు పాఠశాల గోడ కూల్చినట్లు ప్రధానోపాధ్యాయురాలు పొదెం మేనక ఆరోపించారు. పాఠశాల భవనం వెనుక నివాసముండే మహిళ దసరా సెలవులను ఆసరా చేసుకుని తన ఇంటి స్థలానికి అనుకూలంగా పాఠశాల భూమిని కబ్జా చేసేందుకు ప్రహరీని రెండు చోట్ల కూల్చి కబ్జాకు యత్నించినట్లు ఆమె ఆరోపించారు. మంగళవారం పాఠశాల పున: ప్రారంభించడంతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు కబ్జా యత్నాన్ని గుర్తించి మహిళ పై పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.