పోస్ట్ మార్టం గది మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు విజ్ఞప్తి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు గదిని మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు గురువారం హైదరాబాదులో కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు గదిని మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు గురువారం హైదరాబాదులో కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాటారం, మలహర్, మహాముత్తారం మండలాలకు కేంద్రంగా ఉన్న కాటారంలో పోస్టుమార్టం గది నిర్వహిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. మహాదేవపూర్ లోని సామాజిక వైద్య కేంద్రంలో దశాబ్దాలుగా అక్కడే నిర్వహిస్తున్నారని, అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తవి మంజూరు చేయడం లేదని, ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం కాటారం ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం గదిని మంజూరు చేయాలని చల్ల నారాయణరెడ్డి మంత్రి హరీష్ రావును కోరారు.