'తక్షణమే రెగ్యులర్ చేయండి'.. బతుకమ్మలు, ట్యాబ్‌లతో వినూత్న రీతిలో నిరసన

సెకండ్ ఏఎన్ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్‌లో బతుకమ్మలు, ట్యాబ్‌లతో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Update: 2023-08-10 11:19 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: సెకండ్ ఏఎన్ఎం లను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్‌లో బతుకమ్మలు, ట్యాబ్‌లతో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎన్ఎం లు దార్ల జ్యోతి, కొల్లూరి అశ్విని లు మాట్లాడుతూ.. సెకండ్ ఏఎన్ఎంలు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ శ్రమదోపిడికి గురవుతున్నారని.. తక్షణమే రెగ్యులర్ చేయాలని కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సర్వీస్ చేయడం జరిగిందన్నారు.

అయినా ప్రభుత్వానికి మా మీద ఏమాత్రం కనికరం లేకుండా మా న్యాయమైన డిమాండ్లను పరిశీలనలోకి తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని.. నిరసన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజయ్, సారథి ఏఎన్ఎంలు రాములమ్మ విజయ, తులసి, సరిత, సువర్ణ సుమలత, స్నేహలత పాల్గొన్నారు.


Similar News