జనగామలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ చార్జ్
బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్‌ని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ - వరంగల్
దిశ, జనగామ: బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్‌ని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి పై జనగామ జిల్లా పెంబర్తి వద్ద నిరసన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు పెట్టి నిప్పు అంటించారు. అదే సమయంలో పోలీసులు బండి సంజయ్ ని హైదరాబాదుకు తరలిస్తుండగా ఆయన కార్యకర్తలకు పోలీసు వాహనంలో నుండి అభివాదం చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు అడ్డుపడి, ఏకంగా వాహనాల పైకెక్కి నిరసన తెలిపారు. ఆగ్రహించిన పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో జరిగిన ఈ లాఠీచార్జితో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెయిన్ రోడ్ లో నుండి కాకుండా సర్వీస్ రోడ్ల నుండి పోలీసులు ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడంతో పెద్ద ఎత్తున గాయపడ్డారు. దీంతో కార్యకర్తలు ఆందోళనను చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.