చదివింది ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్.. కానీ చేసేది ఏ పనో తెలుసా..
ఉన్నత చదువులు చదివి చేడు వ్యసనాలకు అలవాటు పడి తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను శనివారం సీసీఎస్, కేయూసి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు.
దిశ, హనుమకొండ టౌన్ : ఉన్నత చదువులు చదివి చేడు వ్యసనాలకు అలవాటు పడి తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను శనివారం సీసీఎస్, కేయూసి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సూమారు రూ. 11 లక్షల 50వేల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్ళు, ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డీసీపీ మురళీధర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ఎర్రబోతుల సునీల్, మహబూబాద్ జిల్లా, గంగారం మండలం, పెద్దఎల్లాపూర్ ( ప్రస్తుతం జులై వాడ, హనుమకొండలో నివాసం వుంటున్నాడు).
నిందితుడు సునీల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్సు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఆన్లైన్లో క్రికెట్ తో పాటు ఇతర క్రీడల పై బెట్టింగ్ కు పాల్పడుతూ చేడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దీనితో పెద్ద మొత్తం డబ్బులు పోగోట్టుకోవడంతో తిరిగి డబ్బును సులభంగా డబ్బును సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు మరో నిందితుడితో కలిసి చోరీలు చేసేందుకు సిద్ధమయినాడు. 2020 సంవత్సరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ, హనుమకొండ, మట్వాడ, ధర్మసాగర్, ఆలేర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పదిహేనుకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. 2022 సంవత్సరంలో నిందితుడుని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో పాటు నిందితుడిపై సుబేదారి పోలీసులు పీడీ యాక్ట్ ఉత్తర్వులు కూడా అమలు చేయడం జరిగింది.
గత సంవత్సరం అక్టోబర్లో జైలు నుండి విడుదలయిన నిందితుడు బెట్టింగ్ ఆడేందుకు నిందితుడు చోరీ చేసేందుకు సిద్ధపడి కోద్ది రోజులు డ్రైవర్ గా పనిచేస్తూనే తన యాజమానికి చెందిన ద్విచక్ర వాహనాల పై కాలనీలు తిరుగుతూ తాళం వేసి వున్న ఇండ్లను గుర్తించి చోరీ చేసేవాడు. ఈ విధంగా నిందితుడు రెండు చోరీలకు పాల్పడ్డాడు. కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఏప్రిల్ వడ్డేపల్లిలో పరిమళకాలనీలో చోరీకి పాల్పడగా, ఈ నెల 12వ తేదిన కోమటిపల్లి పోలీస్ కాలనీలో తాళాలు పగులగోట్టి చోరీకి పాల్పడి విలువైన బంగారు అభరణాలను చోరీ చేశాడు. ఈ చోరీల పై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్ అదేశాల మేరకు సీసీఎస్, కేయూసి పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడుని గుర్తించారు.
నిందితుడు ఈరోజు కేయూసీ జంక్షన్ ప్రాంతంలో తిరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో కేయూ జంక్షన్లో వాహనాల తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా ద్విచక్రవాహనం పై వచ్చిన నిందితుడిని తనీఖీ చేయగా నిందితుడి వద్ద చోరీ సొత్తుతో పాటు తాళాలు పగులగోట్టేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో విచారించగా నిందితుడు పాల్పడిన చోరీలను అంగీకరించారు. నిందితుడిని సకాలంలో పట్టుకోని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన డీసీపీ మురళీధర్, క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు, సీసీఎస్, కేయూసి ఇన్స్స్పెక్టర్లు రమేష్ కుమార్, దయాకర్, ఎస్సై రాజేందర్, విజయ్ కుమార్, ఏఏఓ సల్మాన్పషా, హెడాకానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్ళు వంశీ, చంద్రశేకర్, సదానందం, ఎన్.శ్రీకాంత్, వినోద్, నరసింహులు, నజీరుద్దీన్, ఐటీకోర్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.