ములుగులో ఎగురబోయేది గులాబీ జెండానే: ఈసం స్వామి

ములుగు నియోజకవర్గంలో ఎగురబోయేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈసం స్వామి అన్నారు.

Update: 2023-04-25 14:11 GMT

దిశ, కొత్తగూడ: ములుగు నియోజకవర్గంలో ఎగురబోయేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఈసం స్వామి అన్నారు. మంగళవారం ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల అనుసారం కొత్తగూడ, గంగారం మండలాల్లో గ్రామ గ్రామాన ప్రతి ఇల్లూ, ఊరూవాడల్లో గులాబీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఈసం స్వామి మాట్లాడుతూ...దేశమంతా సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్‌తో సాధ్యమవుతుందన్నారు.

అనతి కాలంలోనే దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ప్రజలకు అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు దేశానికి అవసరమని దేశ ప్రజలు నేడు కోరుకుంటున్నట్లు తెలిపారు. 22 ఏండ్ల ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నామని, రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ బలమైన శక్తిగా మారి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశమంతా ప్రవేశ పెట్టేలా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News