Vote for Note: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు భారీ ఊరట.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సుప్రీం కోర్టులో ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌‌ను దాఖలు చేశారు.

Update: 2024-09-20 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సుప్రీం కోర్టు (Supreme Court)లో ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (Justice KV Viswanathan) ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఊహాజనిత జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయలేమని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరిచింది.

అదేవిధంగా దర్యాప్తు విషయంలో సీఎం (CM), హోమంత్రి (Home Minister) కి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని ధర్మాసనం పేర్కొంది. విచారణలో రేవంత్ జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో ఓటు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ఊరట లభించినట్లైంది.  ట్రయల్ కోర్టు (Trail Court) కూడా పారదర్శకంగా కేసు విచారణను పాదర్శకంగా చేపట్టాలని తెలిపింది. అదేవిధంగా కోర్టు రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది.

కాగా, తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే (Nominated MLA)ను కొనేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ (MLA Stephenson) నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) సమయంలో కూడా ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే కేసు విచారణను తెలంగాణ (Telangana) నుంచి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు మార్చాలని సుప్రీం కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రేవంత్ రెడ్డి, ప్రతివాదులకు సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. 


Similar News