Johnny Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-09-20 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (Choreographer Sheikh Jani Basha)ను గోవాలో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ (Cyberabad SOT), నార్సింగి పోలీసులు (Narsinghi Police) ఆయనను నేరుగా హైదరాబాద్‌ (Hyderabad)కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టు (Upparpally Pocso Court)లో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు షేక్ జానీ బాషాకు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చర్లపల్లి జైలు (Charlapally Jail)కు తరలిస్తున్నారు. అదేవిధంగా జానీ మాస్టర్‌ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ (Custody Petition)ను వేయిబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, గతంతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తన వద్ద పని చేసిన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.


Similar News