Johnny Master: కావాలనే ఇరికించారు.. నిజాయితీగా బయటకు వస్తా

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Johnny Master)ను శుక్రవారం నార్సింగి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Update: 2024-09-20 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Johnny Master)ను శుక్రవారం నార్సింగి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడారు. కావాలనే కుట్రపూరితంగా తనను ఇరికించారని ఆవేదన చెందారు. కడిగిన ముత్యంలా నిజాయితీగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి.. ఇబ్బందులకు గురిచేసిన ఎవరినీ వదలిపెట్టబోను అని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కాగా, జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు.. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో అతడిని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టుల్లో ఆయన్ను హాజరుపరిచారు. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Similar News