Alia Bhatt: ఆ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవడంతో తీవ్రంగా శ్రమించా: అలియా భట్

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్, డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-09-20 10:12 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్, డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ స్టార్ బ్యూటీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ బ్యూటీగా రాణిస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘గతంలో నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. నా లుక్స్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాక ఎంతో మారాల్సి వచ్చింది. శరీరాకృతి విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. బరువు తగ్గడానికి తీవ్రంగా శ్రమించాను. దీంతో నన్ను చూసి నా స్నేహితులు డైట్ ఆపేయ్ నీకు నచ్చిన ఆహారం తింటూ ప్రశాంతంగా ఉండు అని అన్నారు.

అయినప్పటికీ నేను వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ఏది ఏమైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. ఈ మేరకు కష్టపడుతూనే ఉన్నాను. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు శరీరాకృతి విషయంలో నా ఆలోచన పూర్తిగా మారింది. అప్పుడు నా లుక్‌ను చూసుకుని నన్ను నేను ఎప్పటికీ విమర్శించుకోకూడదని తెలుసుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.


Similar News