‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘లడ్డు గాని పెళ్లి’.. ‘కళ్ళజోడు కాలేజీ పాప’ను మించి ఉండబోతున్న సాంగ్

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మ్యాడ్’.

Update: 2024-09-20 10:20 GMT

దిశ, సినిమా: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మ్యాడ్’. ఈ వినోదాత్మక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇప్పుడు "లడ్డు గాని పెళ్లి" అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా "లడ్డు గాని పెళ్లి"ని సెప్టెంబర్ 20న విడుదల చేశారు. అయితే.. 'మ్యాడ్' నుంచి వచ్చిన "కళ్ళజోడు కాలేజీ పాప" అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' కోసం ఆయన స్వరపరిచిన "లడ్డు గానీ పెళ్లి" గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదని చెప్తున్నారు చిత్ర బృందం. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Similar News